by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:53 PM
వెండితెరపై చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు కనిపిస్తూ ఉంటారు. వాళ్లలో కొంతమంది మాత్రమే ఆ తరువాత కూడా రాణించగలుగుతారు. కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు మాత్రం ఆ రూట్లో నుంచి పక్కకి వెళ్లిపోతారు. అలాంటివారిలో రవిరాజ్ ఒకరు. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. "మాది మిర్యాలగూడ... ఎస్ఆర్ నగర్లో ఉండేవాళ్లం. నా మొదటి సినిమా 'మా ఆయన బంగారం'. ఆ తరువాత 52 సినిమాల వరకూ చేశాను. నేను నటించిన సినిమాలలో 'హైదరాబాద్ నవాబ్' నాకు బాగా ఇష్టం. నేను యాక్ట్ చేసిన చివరి సినిమా 'కృష్ణమ్మ'. మా నాన్న 'సారా' అమ్మేవాడు. మా అమ్మానాన్నలు... బామ్మ అందరూ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అంతకుముందు వాళ్లు ఎందుకు గొడవ పడ్డారనేది నాకు తెలియదు" అని అన్నాడు. "ఆ తరువాత నుంచి నేను ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాను... బాధను మరిచిపోవడానికి తాగుడికి బానిసనయ్యాను. ఇప్పుడు నేను సెట్ వర్క్ చేయడానికి వెళుతున్నాను. చాలా బరువులు మోయాలి... రోజుకి 700 ఇస్తారు. నటన వైపే వెళ్లాలని నాకు ఉండేది. కానీ అవకాశాల కోసం తిరిగి తిరిగి విసిగిపోయాను. రేపురా... ఎల్లుండిరా అని అలా తిప్పిస్తూనే ఉన్నారు. నాకు ఎవరి సపోర్ట్ లేదు... బ్యాక్ గ్రౌండ్ లేదు. అందుకే, ఇదంతా కాని పనిలే అనుకుని రోజువారీ పనికి పోతున్నాను" అని చెప్పాడు.
Latest News