|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 12:41 PM
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మరికాసేపట్లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద కోలాహలం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులతో పాటు, అధిక సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ నిర్వహించిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌తో పాటు 11 మందితో మంత్రులుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన 'ఆరు గ్యారంటీ'లకు సబంధించిన ముసాయిదాపై సీఎం హోదాలో రేవంత్ తొలి సంతకం చేయనున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.