|
|
by Suryaa Desk | Thu, Dec 07, 2023, 01:25 PM
హైదరాబాద్ నగరంలోని ప్రగతి భవన్ ముందున్న భారికేడ్లను పోలీసులు, జిహెచ్ఎంసి సిబ్బంది గురువారం తొలగించారు. మరికొద్ది సేపట్లో తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడునున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.
తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్‌తో పాటు 11 మందితో మంత్రులుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన 'ఆరు గ్యారంటీ'లకు సబంధించిన ముసాయిదాపై సీఎం హోదాలో రేవంత్ తొలి సంతకం చేయనున్నారు.