by Suryaa Desk | Fri, Sep 20, 2024, 03:17 PM
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ప్రభుత్వాన్ని కోరారు. తిరుమలలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆయన చెప్పారు.టెండరింగ్ ప్రక్రియే తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై వాస్తవాలు తెలుసుకునేందుకు సమగ్ర విచారణ చేయాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఓ వీడియో సందేశాన్ని శుక్రవారం విడుదల చేశారు. లడ్డూ తయారీలో నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనే విషయం భయంకరమైందిగా చెప్పారు.ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు.