by Suryaa Desk | Fri, Nov 15, 2024, 04:03 PM
కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతిన్నది. తాజాగా, వెలుగులోకి వచ్చిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే భాగ్యనగరంలో ఫుడ్స్ సేఫ్టీపై ఆందోళన కలిగిస్తోంది. ఈ సర్వేలో ఫుడ్ క్వాలిటీ విషయంలో హైదరాబాద్ చివరిగా నిలిచింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహించింది. అందులో కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో హైదరాబాద్ నిలిచింది. గడిచిన రెండు నెలల వ్యవధిలో 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా భాగ్యనగరం అప్రతిష్టను మూటగట్టుకుంది. 62శాతం హోటల్స్, గడువుతీరిన పాడైపోయిన కుళ్ళిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. బిర్యానీ శాంపిల్స్‌లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నిర్వహించిన సర్వేలో తేలింది.