by Suryaa Desk | Sat, Nov 16, 2024, 07:26 PM
'ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. మీ అమ్మ, నాన్నను కూడా చంపేస్తా' అంటూ ఓ ప్రేమోన్మాది స్నేహితురాలిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. గతకొన్ని రోజులుగా యువతిని వెంబడిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గతంలో తాము దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి పరువు తీస్తానంటూ ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీంతో అతడి ఆగడాలు తట్టుకోలేక పోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన హైదరాబాద్ హయత్నగర్లో చోటు చేసుకుంది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున సాగర్ ప్రాంతానికి చెందిన చెరుకుపల్లి విజయ్, నగరానికి చెందిన ఓ యువతి స్నేహితులు. డిగ్రీ చదివే సమయంలో ఇద్దరికీ పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆమెను విజయ్ ప్రేమ పేరుతో వేధించటం మెదలు పెట్టాడు. గతంలో తాము సరదాగా కలిసి ఉన్న సమయంలో దిగిన ఫోటోలు, వీడియోలు అందరికీ చూపిస్తానంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. బస్ స్టాండ్లోనూ, కాలేజీ ఎదుట ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కాలేజీ నుంచి వస్తున్న సమయంలో వెంటపడి.. బలవంతంగా తన బైక్ ఎక్కాలని ఒత్తిడి తెచ్చాడు.
చాలా సార్లు కాలేజీలో వెంటబడి కొట్టాడని.. బంధువుల అందరికీ ఫోన్ చేస్తూ మీ బిడ్డని చంపుతా అని బెదిరిస్తున్నాడని యువతి వాపోయింది. తనను ప్రేమించాలని లేదంటే ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చి లైఫ్ లేకుండా చేస్తానని.. తల్లిదండ్రులను కూడా చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది. గతంలో తన ఇంటికి వచ్చి తండ్రిపై దాడి చేశాడని.. మరికొందరు అమ్మాయిలను కూడా ఇలాగే వేధింపులకు పాల్పడ్డాడని చెప్పింది. విజయ్ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని వాపోయింది. ఈ మేరకు హయత్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలోనే తాను ప్రేమించిన అమ్మాయిని విదేశాలకు పంపించాడన్న కోపంతో ఓ ప్రేమెన్మాది ఏయిర్ గన్తో అమ్మాయి తండ్రిపై కాల్పులకు తెగ బడ్డాడు. ఈ ఘటనలో అమ్మాయి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటన మరవక ముందే మరో ప్రేమోన్మాది చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.