by Suryaa Desk | Wed, Nov 13, 2024, 02:20 PM
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బీజేపీ మాజీమండల ప్రధాన కార్యదర్శి వల్లే రమేష్ అధ్యక్షతన పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *నర్సంపేట నియోజకవర్గం కంటెస్టెడ్ అభ్యర్థి డాక్టర్ కంభంపాటి పుల్లారావు హాజరై పత్రిక సమావేశంలో మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో నల్లబెల్లి మండలంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించారని అన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలలో భాగంగా నర్సంపేట నియోజకవర్గం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటువంటి రైతు సంక్షేమ పథకాలు రైతు వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధరను అందించడమే కాకుండా రైతుల నుంచి సేకరించిన ధాన్యమును కేంద్ర ప్రభుత్వమే కొంటున్నది కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని రైతులందరికీ విజ్ఞప్తి చేశారు.
నూతనంగా ప్రవేశపెట్టిన విద్య ప్రయోజనాల ఆయుష్మాన్ భారత్ రేషన్ బియ్యం 60 ఏళ్లు భయపడిన వారికి హెల్త్ ఐదు లక్షలు ఇన్సూరెన్స్ కార్డులు దేశ ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్నటువంటి పథకాలు దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రజలను కోరారు మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలను ఇచ్చి గద్దెనెక్కినంక ఆ గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు అలాగే మండలంలో సభ్యత్వాలను అధికంగా చేసినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మాజీ ఉపాధ్యక్షులు వేముల రాజు ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము మరియు నియోజకవర్గ నాయకులు వనపర్తి మల్లయ్య దైవరుప్పుల శేఖర్ నల్లబెల్లి బూత్ అధ్యక్షులు వేముల బిక్షపతి లక్ష్మయ్య గణేష్ కొండపూర్ బూత్ అధ్యక్షులు కుంజ వసంత్ తదితరులు పాల్గొన్నారు.