by Suryaa Desk | Wed, Nov 13, 2024, 02:40 PM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు బుధవారం ఆందోళనకు దిగారు. వారంలో ఒకసారి మాత్రమే నడిచే జమ్ము తావి ఎక్స్ ప్రెస్ ను అధికారులు రద్దు చేయడంతో నిరసన తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, అందుకే రైళ్ల సేవలు రద్దు చేసినట్లు సిబ్బంది సముదాయించారు. అయినా పలువురు ప్రయాణికులు 'వీ వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు.జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ (13151) అనేది కోల్‌కతా- జమ్ము తావి మధ్య నడిచే రోజువారీ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు కోల్‌కతా నుండి జమ్మూ- కాశ్మీర్‌కు వరకూ ప్రయాణిస్తుంది. 1981 కిలోమీటర్లు ప్రయాణించే ఈ రైలు ప్రయాణం దాదాపు 46 గంటలు. అంటే దాదాపు రెండు రోజులు.