by Suryaa Desk | Thu, Nov 14, 2024, 02:08 PM
తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన అఘోరీ మాత గురువారం మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అఘోరీని చూసేందుకు, ఆమె ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిమాలయాలను వదిలి దేశంలో పర్యటిస్తున్నానని చెప్పిన అఘోరీ తన మాటలు, చర్యలతో వివాదస్పద మయ్యారు. కొద్ది రోజులుగా ఏపిలోని శైవ క్షేత్రాలను సందర్శించిన ఆమె ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్నారు.మహిళలపైన, దేవాలయాలపైన దాడులు ఆపకపోతే తెలంగాణ ప్రభుత్వానికి శివతాండవం చూపిస్తానంటూ, అత్యాచారాలకు పాల్పడే వారి అంగాలను ఖండిస్తామంటూ హెచ్చరికలు చేశారు. అఘోరీ తొలుత తమిళనాడు నుంచి తెలంగాణకు, ఇక్కడి నుంచి కేదరినాథ్ కు, మళ్లీ తెలంగాణకు, ఇటు నుంచి కార్తీక మాసం శైవ క్షేత్రాల సందర్శన పేరుతో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి, మళ్లీ తెలంగాణకు చేరుకుని తన చర్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.