by Suryaa Desk | Thu, Nov 14, 2024, 01:40 PM
TG: రెండు రోజులుగా పెళ్లి వేడుకల్లో సందడి చేసిన యువకుడు.. అంతలోనే గుండెపోటుతో అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద ఘటన బుధవారం రాత్రి జగిత్యాల జిల్లాలోని మోత్కూరావుపేట గ్రామంలో జరిగింది. కమ్మరిపేట గ్రామానికి చెందిన సంజీవ్ (23) తన మేనమామ కొడుకు పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తున్న క్రమంలో గుండెపోటుకు గురై కుప్పకూలాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. యువకుడి మృతితో పెళ్లింట విషాదం నెలకొంది.