by Suryaa Desk | Thu, Nov 14, 2024, 12:53 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నిర్వహించిన ఈ సర్వేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సర్వేలో బాగంగా ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లోని మహమ్మద్ నయీమ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా నయీం కుటుంబ సభ్యులను కలిసి వారి వివరాలను దగ్గరుండి నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అధికారులు ఉన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ NBT నగర్ లోని ఎన్ క్లెవ్ అపార్ట్మెంట్స్ లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనడం జరిగింది !@INCTelangana @INCIndia pic.twitter.com/K0XuBpEr7V
— Ponnam Prabhakar (@Ponnam_INC) November 14, 2024