by Suryaa Desk | Wed, Nov 13, 2024, 06:16 PM
హైడ్రా హైదరాబాద్ నగరంలో మరోసారి కూల్చివేతలు ప్రారంభించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. రాంపల్లి సమీపంలోని రాజ్సుఖ్ నగర్ కాలనీలో ఈ కూల్చివేతలు చేపట్టింది. హైడ్రా అధికారులు జేసీబీతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.పలువురు బిల్డర్లు పదిహేనేళ్ల క్రితం రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లుగా హైడ్రా గుర్తించింది. దీంతో రెండు బృందాలుగా విడిపోయి కూల్చివేతలు చేపడుతున్నారు. రాంపల్లి క్రాస్ రోడ్డుకు సమీపంలో రాజ్సుఖ్ నగర్ ఉంది. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా స్థానికంగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ కూల్చివేతలకు సంబంధించి నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నారు.