by Suryaa Desk | Wed, Nov 13, 2024, 06:15 PM
వారందరికీ రైలు ఎక్కాలని అమిత ఇష్టం. కానీ రైలు టికెట్ మాత్రం కొంటారు.. రైలు మాత్రం ఎక్కరంటే ఎక్కరు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే సూపర్ ప్లాన్ అనేస్తారు.ఇలా రైలు టికెట్ కొని రైలెక్కని గ్రామం ఎక్కడో ఉందని అనుకుంటే పొరపాటే. ఆ గ్రామం పేరే నెక్కొండ. పేరు వెరైటీగా ఉంది.. ఇదెక్కడో అనుకునేరు.. మన తెలంగాణలోని ఓ చిన్న గ్రామమిది. అసలు ఆ గ్రామస్థులు అలా ఎందుకు చేశారో తెలుసుకుందాం.ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో నెక్కొండ అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామానికి రైల్వే స్టేషన్ సదుపాయం ఉంది. గ్రామస్థులకు రైలు ఎక్కాలన్న కోరిక కూడా ఉంది. టికెట్ రైలెక్కని కారణం తెలుసుకుంటే.. గ్రామస్థులను అభినందించాల్సిందే.ఈ గ్రామస్థులు ప్రతి రోజూ తమ రైల్వే స్టేషన్ లో 60 టికెట్లు కొనుగోలు చేస్తారు. మరి రైలు ఎక్కకుండానే ఆ టికెట్ల కొనుగోలు ఎందుకంటే.. నెక్కొండ రైల్వే స్టేషన్ నర్సంపేట నియోజకవర్గంలో ఉండగా, ఆ నియోజకవర్గ ప్రజలకు ఈ స్టేషన్ ఒక వరమని చెప్పవచ్చు. అటువంటి రైల్వే స్టేషన్ లో కొన్ని రైళ్లు ఆగవు.అయితే ప్రజల వినతులు స్వీకరించిన రైల్వే అధికారులు , ఎట్టకేలకు సికింద్రాబాద్ – గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు తాత్కాలిక హాల్టింగ్ అనుమతులు ఇచ్చారట. కనీసం మూడు నెలలు వచ్చే ఆదాయాన్ని బట్టి , రైల్వే స్టేషన్ వద్ద పూర్తి స్థాయి హాల్టింగ్ సర్వీస్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.తోటి ఉద్యోగి కిస్ చేయలేదని హత్య.. డాక్టర్‌ను 7 సార్లు కత్తితో పొడిచిన పేషెంట్ఇక అంతే గ్రామస్తులు ఒక వాట్సాప్ గ్రూప్ ను రైల్వే టికెట్ ఫోరం పేరుతో ఏర్పాటు చేసుకొని నిధులు సమకూర్చుకున్నారు. ప్రతి రోజూ రైల్వే స్టేషన్ వెళ్లడం టికెట్ కొనుగోలు చేయడం, రైల్వేకు ఆదాయాన్ని అందివ్వడం ఆ గ్రామస్థులకు పనిగా మారింది. ఎలాగైనా తమ గ్రామంలో ఆ రైలు నిలుపుదల కోరుతూ గ్రామస్థులు ఏకం కావడంతో రైల్వే అధికారులు సైతం ఆశ్చర్యపోయారట. చివరికి వారు అనుకున్నది సాధించారు. ఇప్పుడు పూర్తి స్థాయి హాళ్టింగ్ సౌకర్యం కల్పించారు రైల్వే అధికారులు. అందుకే అంటారేమో ఐకమత్యమే మహాబలం అని. అందరూ ఒక్కటయ్యారు.. అనుకున్నది సాధించారు.