by Suryaa Desk | Fri, Nov 15, 2024, 12:40 PM
నిర్మల్ జిల్లాలో పెద్ద పులి సచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజులుగా జిల్లాలో ఏదో ఒక చోట.. పెద్ద పులి కనిపించిందనే వార్త స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పెద్ద పులి కనిపించింది. ఖానాపూర్ మండలంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారుల సూచించారు.ఒంటరిగా ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని, మీకు సంబంధించిన పశువులు అడవిలోకి వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. రాత్రిళ్లు సైతం త్వరగా ఇంటికి చేరుకోవాలని ఆలస్యంగా వెళ్లేవారు ఒంటరిగా కాకుండా లైటు, కర్ర చేతిలో పట్టుకుని వెళ్లాలన్నారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.