by Suryaa Desk | Fri, Nov 15, 2024, 07:11 PM
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవలే టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ కమిషనర్‌గా బదిలీ చేసింది. కానీ.. ఆమె మాత్రం ప్రభుత్వం అప్పజెప్పిన కొత్త బాధ్యతలు తీసుకోకుండా మహారాష్ట్రలో ఉన్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికలు ఉండగా.. అక్కడి బుల్దానా, మల్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్ అబ్జార్వర్‌గా స్మితా సబర్వాల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. దీంతో.. స్మితా సబర్వాల్ మహారాష్ట్రలో తన సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ కూడా ఆమె క్రేజ్ మామూలుగా లేదు. అధికారులకు తనదైన శైలిలో దిశానిర్దేశం చేస్తూ.. ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూసుకుంటున్న స్మితా సబర్వాల్‌ను కొంతమంది అభిమానులు వచ్చి కలుస్తుండటం విశేషం.