by Suryaa Desk | Thu, Nov 14, 2024, 03:14 PM
రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల అయింది.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం కాలం గడిచింది. సంవత్సర కాల కాంగ్రేస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పోరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పని చేస్తుందన్నారు జగన్. పౌర ప్రాధమిక హక్కులను, జీవించే హక్కును కాల రాస్తున్నది.రాష్ట్రాన్ని కార్పోరేట్లకు కట్టపెట్టడానికి ఆర్ధిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పోరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక విభాగాలను ఏర్పర్చి వాటికి విస్తృత అధికారాలను కట్టబెట్టి బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహించారు. మూసీ నదిని పర్యాకటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చారిత్రిక కట్టడాలను నిర్మించడానికి దేశీ, విదేశీ కార్పోరేట్ల వేల కోట్ల పెట్టుబడులను ఆహ్వనించాడని ఫైర్ అయ్యారు. మూసి నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు స్వేచ్ఛమైన తాగు నీరును అందించడానికి పరిశుభ్రత చర్యలు చేపట్టడంలేదని మండిపడ్డారు.