by Suryaa Desk | Wed, Nov 13, 2024, 05:57 PM
దారి తప్పాడు.. జైలుకెళ్లాడు.. బయటకు వచ్చాడు.. నమ్మకంగా పనికి కుదిరాడు.. ఆ నమ్మకమే అతడి వివాహం జరిపింది. అయిన వారికి మాత్రం దూరమై ఏకంగా 28 ఏళ్లు దూరమయ్యాడు.కానీ ఎక్కడో మనసులో ఓ కొరత. అందరూ ఉన్నా ఇంకా అనాథలా ఉండాలా అనుకున్నాడు. తన వారిని కలవాలని నిర్ణయించుకున్నాడు.12 ఏళ్ల వయస్సులో దారి తప్పి దూరమైన ఆ బాలుడు, నేడు 40 ఏళ్ల వయస్సులో ఇంటికి రాగా.. ఆ ఇంట ఆనందం అంతా ఇంతా కాదు. కానీ లైఫ్ ని ఓసారి తిరగేస్తే మాత్రం, ఓ చిన్న సినిమానే తీసేయొచ్చు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో..కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలో కచ్చు బక్కయ్య, బక్కవ్వ లకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె సంతానం కలరు. పెద్ద కుమారుడు కొమరయ్య, చిన్న కుమారుడు మల్లయ్య లతో పాటు ఓ కుమార్తె ఉండగా చిన్న కుమారుడు మల్లయ్య 12 ఏళ్ల వయసులో ఉండగా తల్లి బక్కవ్వ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మృతి చెందింది. మృతి చెందిన తల్లిని చూడడానికి వెళ్లిన మల్లయ్య కన్నీరు మున్నీరయ్యాడు. ఈ క్రమంలో మల్లయ్యకు తీవ్ర దాహం వేయడంతో, నీరు త్రాగి వచ్చే బయటకు వచ్చాడు. మళ్లీ తిరిగి వెళ్లే సందర్భంలో వచ్చిన దారిని మరచిపోయాడు. ఇక దారి తప్పాడు.చేసేదేమీ లేక వరంగల్ పట్టణంలో బాల్యంలోనే కూలి పని చేస్తూ, బాల్య కార్మిక నిర్మూలన అధికారులకు పట్టుబడ్డాడు. కొన్ని రోజులు బాల నేరస్తుల జైలులో ఉన్నాడు. అనంతరం బయటకు వచ్చి వరంగల్ పట్టణంలోని పూల వ్యాపారి వద్ద పనికి కుదిరాడు. నమ్మకానికి మారు పేరుగా ఉన్న మల్లయ్య, చిన్నప్పటి నుండి తన వద్దే ఉండడంతో ఆ పూల వ్యాపారి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఒక కొడుకు జన్మించాడు.ఇలా కొన్ని రోజులు గడవగా తనకు తన కుటుంబ సభ్యులు చూడాలని ఆశ పుట్టింది. అందరూ ఉండి కూడా అనాథగా బ్రతకాల్సిందేనా అంటూ మనోవేదనకు గురయ్యేవాడు. మొదటి నుండి తన వారిని కలుసుకోవాలని ఉన్నప్పటికీ, రాలేని పరిస్థితి అతనిది. ఇప్పటికైనా తన కుటుంబ సభ్యులను కలవాలని, తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇక అంతే తన ఇంటి బాట పట్టాడు. రాడనుకున్న మల్లయ్య తన కుటుంబ సభ్యుల వద్దకి రావడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందపడ్టారు. ఆ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. అందరూ చిరునవ్వులతో యోగక్షేమాలు తెలుసుకున్నారు.టికెట్ కొనకుండా రైలెక్కడం చూసి ఉంటాం.. కొని కూడా ఎక్కరు వీరు.. ఎందుకిలా? చివరికి ఏమైంది? తాను బాల్యంలో ఉండగా తన తల్లి మృతి చెందిందని, ఆ సందర్భంలోనే వస్తాననుకున్నానని ఇక్కడికి వస్తే తన కుటుంబ సభ్యులు ఏమంటారో అనే భయంతో ఇక్కడికి రాలేదని వాపోయారు మల్లయ్య. ఇక నుండి తాను తన గ్రామంలోనే ఉంటానని, తన కుటుంబ సభ్యులు కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మల్లయ్య అన్న కొమరయ్య కూడా తన తమ్ముడు ఇక రాడనుకున్నానని, 28 ఏళ్ల తరువాత తన తమ్ముడు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని, తన తమ్ముడికి అన్ని విధాల తోడు ఉంటానని తెలిపారు. అందుకే అంటారు.. ఏనాటికైనా రక్తసంబంధం ఒక్కటి కాక మానదని.