by Suryaa Desk | Thu, Nov 14, 2024, 07:41 PM
భారతీయ పసిడి ప్రియులకు చాలా కాలం నిరీక్షణం తర్వాత తిరిగి మంచిరోజులు మెుదలయ్యాయి. దాదాపు వారం రోజుల నుంచి గోల్డ్ రేట్లు నిరంతరాయంగా తగ్గుదలను చూస్తున్నాయి.అమెరికా ట్రంప్ రాకతో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు తీసుకుంటున్న నిర్ణయాలు పసిడికి డిమాండ్ తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న వేళ చాలా మంది ఆభరణాల షాపింగ్ కోసం ప్రస్తుతం ఈ తగ్గిన ధరలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. అయితే కొనుగోలుకు వెళ్లటానికి ముందు మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవటం ముఖ్యం..22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.11,000 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6935, ముంబైలో రూ.6935, దిల్లీలో రూ.6950, కలకత్తాలో రూ.6935, బెంగళూరులో రూ.6935, హైదరాబాదులో రూ.6935, కేరళలో రూ.6935, వడోదరలో రూ.6940, అహ్మదాబాదులో రూ.6940, జైపూరులో రూ.7059, లక్నోలో రూ.7095, కోయంబత్తూరులో రూ.7044, మంగళూరులో రూ.6935, నాశిక్ లో రూ.6935, అయోధ్యలో రూ.6950, బళ్లారిలో రూ.6935, గురుగ్రాములో రూ.6950, నోయిడాలో రూ.6950గా ఉన్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.12,000 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన పసిడి విక్రయ రిటైల్ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7565, ముంబైలో రూ.7565, దిల్లీలో రూ.7580, కలకత్తాలో రూ.న, బెంగళూరులో రూ.7565, హైదరాబాదులో రూ.7565, కేరళలో రూ.7565, వడోదరలో రూ.7570, అహ్మదాబాదులో రూ.7570, జైపూరులో రూ.7699, లక్నోలో రూ.7699, కోయంబత్తూరులో రూ.7684, మంగళూరులో రూ.7565, నాశిక్ లో రూ.7568, అయోధ్యలో రూ.7580, బళ్లారిలో రూ.7565, గురుగ్రాములో రూ.7580, నోయిడాలో రూ.7580 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.6935గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7565 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6935గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7565 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1500 తగ్గి నేడు రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది. పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ, తరుగు, వ్యాపారి లాభాలు, మజూరి వంటివి కలపకముందు రేట్లుగా గుర్తుంచుకోవాలి.