by Suryaa Desk | Sun, Nov 17, 2024, 11:31 AM
రామగిరి మండలంలో అన్ని గ్రామాలలో ప్రభుత్వం నిర్దేశించిన సమగ్ర సర్వే వేగవంతం అయింది. ప్రభుత్వము కుల గణనా, ఆర్థిక, రాజకీయ ఇతర అంశాలపై సర్వే నిర్వహిస్తుంది. ఈ క్రమంలో రామగిరి మండలంలో 17 గ్రామాలలో సర్వేను 102 మంది ఏనుమ్యూరేటర్లు నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వారి స్థితిగతులను అడిగి తెలుసుకుంటున్నారు.
ఎంపీడీఓ బద్రి శైలాజ రాణి, ఎంపీఓ దేవరకొండ ఉమేష్,ఐసీడీఎస్ సూపర వైజర్ లు పల్లె అనిత, పర్కల.శారదా, డిప్యూటీ తహసీల్దార్ రుద్రంబట్ల మానస, మండల వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్, ఆర్.ఐ లు కే. మహేష్,రెవెళ్లి నిహారిక, ఐకేపీ ఏపీఎం గొట్టే స్వరూప రాణి, గ్రిడ్ ఏ.ఈ వాసవి, ఉపాధి ఈ.సీ రాసపల్లి లక్ష్మన్ లు ఆయా గ్రామాలలో సర్వే పనులను పరిశీలిస్తున్నారు.