by Suryaa Desk | Sun, Nov 17, 2024, 11:38 AM
దేవరకొండ పట్టణంలోని పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రక్కన నూతనంగా స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి క్రీ'శే" కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.విగ్రహాన్ని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మరియు చిలువేరు కాశీనాథ్ ఆవిష్కరించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.
తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు.బాపూజీ త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియాలని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నర్సింహా,అఖిల భారత సంఘం అధ్యక్షులు కండగట్ల స్వామి,భద్రాచలం పద్మశాలి అన్నసత్రం అధ్యక్షులు బోసిక యాదగిరి, పద్మశాలి అధ్యక్షులు శీరాందాస్ కృష్ణయ్య,కార్యదర్శి పగడిమర్రి రాఘు రాములు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.