by Suryaa Desk | Sun, Nov 17, 2024, 11:34 AM
జగిత్యాల విద్యార్థులతో కళాశాలలను బహిష్కరించి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేసి కలెక్టర్ కి మెమోరాండం అందజేసిన జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు.. నిన్న తేదీ 16-11-2024 శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వేలాదిమంది విద్యార్థులతో జగిత్యాల జిల్లా కలెక్టర్, కార్యాలయాలను ముట్టడించి నిరసన తెలియజేశారు. ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు కళాశాలలను బహిష్కరించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించారు. మరియు ఫీజుల బకాయిలు 7,850 కోట్లు, పెరిగిన నిత్యావసరాల వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల స్కాలర్షిప్లు 5,500 నుంచి 20 వేలకు పెంచుతూ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు స్కాలర్షిప్లకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే ఇవ్వాలి, మరియు రాష్ట్రంలోని గురుకులాలు అభివృద్ధి చేయాలి. లేకుంటే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్. ఈ సమావేశంలో గురుకులాల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల విద్యా, కోసం విద్యార్థులకు రావాల్సిన 7,850 కోట్ల బకాయిలను విడుదల చేసి గురుకులాలు అభివృద్ధి చేయాలని గురుకుల పాఠశాలలలో పిల్లలు చచ్చిపోతున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల పిల్లలు చచ్చిపోతే ఇలానే మౌనంగా ఉంటారా అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్ లను తక్షణమే విడుదల చేయాలని ఫీజు రియంబర్స్‍మెంట్ వెంటనే చెల్లించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలు చేపడతారని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, జగిత్యాల బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బి.సి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు బందెల మల్లయ్య, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.