by Suryaa Desk | Sun, Nov 17, 2024, 11:46 AM
ఎస్ఎఫ్ఐ పీ.ఏ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో దుగ్యాల ఆదర్శ పాఠశాల వెళ్లే రోడ్డును ఎస్ఎఫ్ఐ మండల కమిటీ పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా పరిశీలన వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ. పాఠశాల వెళ్లే విద్యార్థిని విద్యార్థులు రోడ్డు దుస్థితి వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పాఠశాలకు వచ్చేటటువంటి విద్యార్థులు ఆటో,బస్సు, బైక్ రవాణా సౌకర్యం ద్వారా రావడం జరుగుతుంది రోడ్డు గుంతలగా మారి కంకర తేలడంతో పాఠశాలకు అర కిలోమీటర్ దూరంలో దించడం వలన కాలినడక చేయాల్సిన పరిస్థితి నెలకొందని అదేవిధంగా పాఠశాలకు వెళ్లేటప్పుడు విద్యార్థులు నడుస్తున్నటువంటి సందర్భంలో ముందల ఉన్నటువంటి వాహనాలు దుమ్ము ధూళి కంకర తాకి ఇబ్బందులు గాయాల పాలవుతున్నారని అన్నారు.రోడ్డు వేసి సమయంలో సదర్ కాంటాక్ట్ ప్రమాణాలు పాటించకపోవడం వలనే రోడ్డు వేసిన కొంతకాలానికే త్వరగా పాడైందని అన్నారు అదేవిధంగా వర్షం వస్తే పాఠశాలకు వెళ్లాలంటే కూడా రాకపోకలు బంద్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు తక్షణమే విద్యార్థుల సమస్యలు తగిన అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం చేయాలని వారు అన్నారు లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉదృతం చేసామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బియ్యపల్లి మండల కార్యదర్శి దున్న రవి,జెల్లల ఇద్దిరాములు,పొట్ల రాకేష్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.