by Suryaa Desk | Fri, Sep 20, 2024, 03:51 PM
జిల్లా లోని పిల్లల ఎదుగుదలను అంగన్వాడి కేంద్రాల ద్వారా పక్కాగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరు పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.
అంగన్ వాడి కేంద్రాల పనితీరు,అంగన్వాడి కేంద్రాల ద్వారా అందుతున్న సేవలు లబ్ధిదారుల వివరాలు, ప్రీ స్కూల్ నిర్వహణ , శిక్షణ మొదలగు వివరాలను కలెక్టర్ సంక్షేమ అధికారి అడిగి తెలుసుకున్నారు. నెలలో ఎన్ని అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు, అక్కడ గమనించిన పరిస్థితులు మొదలగు వివరాలను కలెక్టర్ సూపర్వైజర్ లను ఆరా తీశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, అంగన్వాడి టీచర్లకు ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య ప్రీస్కూల్ కరికులం గురించి, కరదీపిక & ప్రియదర్శిని పుస్తకాల ఆవశ్యకత ప్రాముఖ్యత తెలిసేలా సూపర్వైజర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.ప్రీ స్కూల్లో పిల్లల అటెండెన్స్ తగ్గకుండా చూసుకోవాలని, దానికి తగిన విధంగా టీచర్లకు శిక్షణ అందించే బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్ వాడి కేంద్రాల తనిఖీ సమయంలో పిల్లలకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహిస్తానని, వారిని దానికి తగిన విధంగా తీర్చిదిద్దుతూ , పిల్లల భవిష్యత్తుకు మంచి పునాదులు వేయాలని కలెక్టర్ వివరించారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను 100% మానిటరింగ్ చేయాలని, పోషణ లోపంతో బాధపడే పిల్లలను గుర్తించి వారికి బాలామృతం ప్లస్ సరఫరా అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ కమోడిటీ పరంగా ఎటువంటి గ్యాప్ లేకుండా ఐసిడిఎస్ సర్వీస్ లకు ఆటంకం కలగకుండా చూడాలని, దీనికి సంబంధించి గ్యాప్స్ వస్తే వెంటనే అదనపు కలెక్టర్ కు లేదా తనకు తెలియజేయాలని కలెక్టర్ సిడిపిఓ లను ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాలలో వచ్చే గుడ్లు తీసుకునే సమయంలో దాని బరువు ప్రమాణాలు పరిశీలించాలని, ప్రమాణాలు లేని పక్షంలో గుడ్లు తీసుకోవద్దని టీచర్లకు సూచించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పోషణ లోపంతో ఎత్తు తక్కువ, బరువు తక్కువ గల పిల్లల కోసం నిర్దేశించిన సూపర్వైజడ్ సప్లిమెంట్ ఫీడింగ్ ప్రోగ్రాం సంబంధించిన వీడియోలు గ్రూపులలో షేర్ చేస్తూ, ఆ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని అన్నారు. మాల్ న్యూట్రిషన్ సంబంధించి సంక్షేమ శాఖ వద్ద, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా ఒకే విధంగా సమాచారం ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్,సిడిపిఓ లు కె.కవిత, అలేఖ్య, పుష్పలత, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ అనిల్ కుమార్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.