by Suryaa Desk | Sat, Sep 21, 2024, 02:32 PM
పర్టీలైజర్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించి విక్రయాలు చేయాలని ఎడిఎ నూతన్ కుమార్ సూచించారు. కంగ్టి మండల కేంద్రంలోని రైతు వేదిక లో పర్టీలైజర్ డీలర్లతో మండల వ్యవసాయ అధికారి,వెంకటేశం, ఎడిఎ నూతన్ కుమార్ శుక్రవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ.... ప్రతి ఒక పర్టీలైజర్ డీలర్ అమ్మిన ఎరువులను తమ వద్ద ఉన్న ఈ పాస్ మిషన్ లో నమోదు చేయాలని అన్నారు. ప్రతిదీ రికార్డ్ లో నమోదు చేసుకోవాలని డీలార్ల కు సూచించారు. కంగ్టి మండల డీలర్లు శనివారం నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తమ లైసెన్స్ కాపీలు జాతపార్చి ప్రతి ఒక డీలర్లు ఈ పాస్ మిషన్ ను వెంట తీసుకెల్లా లని తెలిపారు.
అనంతరం ఏడిఏ నూతన్ కుమార్ మాట్లాడుతూ .... 1973 మూమెంట్ కంట్రోలర్ ఆర్డర్ ప్రకారం పక్క రాష్ట్రంలోని ఎరువులను మన రాష్టంలో అమ్మారాదని పర్టీలైజర్ డీలర్ల లకు సూచించారు.ఒక్క రైతుకు ఒకరోజుకు కేవలం ఐదు బస్తాలు మాత్రమే ఇవ్వాలని అన్నారు. రబీ పంటకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే తీసుకోని రైతులకు విక్రయించాలనిన్నారు. ప్రతి ఒక పర్టీలైజర్ డీలర్లు O, ఫామ్, PC లు ఆన్లైన్ చేసుకోలాని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్టీలైజర్ డీలర్లు, రమేష్ సెట్, నర్సారెడ్డి, రాజు సెట్, బస్వా, శ్రీనివాస్, రాజు, తదితరులు పాల్గొన్నారు.