by Suryaa Desk | Sat, Sep 21, 2024, 03:37 PM
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్రస్థాయి ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఎస్ ఎల్ బి సి సొరంగం పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
పదేండ్లుగా వివక్షకు గురైన నల్గొండ జిల్లా ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేసేందుకు నిధులు విడుదలకు విజ్ఞప్తి చేయగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు
నల్గొండ జిల్లాలోని ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టుకు నెలవారిగా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది - మంత్రి తెలిపారు.
గత పదేండ్లు గా నల్లగొండ జిల్లా రైతులు సాగునీళ్లు లేక ఇబ్బందులు పడ్డారని, ప్రజల ఆశీర్వాదంతో రాబోయే రెండేళ్లలో టన్నెల్ పనులను పూర్తిచేసి నల్గొండ ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు
ఎస్ ఎల్ బి సి హై లెవెల్ కెనాల్ కు సంబంధించి మరమత్తులో ఉన్న 4 వ పంపును మూడు రోజుల్లో మరమ్మత్తు పూర్తి చేసి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు
ఎస్ ఎల్ బీ సీ ని త్వరితగతిన పూర్తి చేసేందుకు నేలకు 30 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి,ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, వేముల వీరేశం, బాలు నాయక్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ సి నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు