by Suryaa Desk | Sun, Nov 17, 2024, 08:02 PM
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని తెలంగాణ మంత్రులు కొండా సురేఖ , సీతక్క అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా హనుమకొండలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నిర్వహించే ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని చెప్పారు. సభావేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టామన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరు ఆరింటిలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని కొండా సురేఖ చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారన్నారు. వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపారు. శతాబ్దాల తర్వాత కులగణన చేపడుతున్నామని.. ఇది సాధారణ విషయం కాదన్నారు. తెలంగాణ వేదికగా దీన్ని నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. రైతుల విషయంలోనూ తమ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదన్నారు. సంక్షేమం, అభివృద్ధితో ముందుకెళ్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం ఖజానాను దివాళా తీయించిన పరిస్థితుల్లో సీఎం రేవంత్ ధైర్యంగా ముందుకెళ్తున్నారన్నారు.
సీతక్క మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదన సభ ఇది అని చెప్పారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా భవన్‌లు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. భారాస ప్రభుత్వం పదేళ్లలో 21 లక్షల మందికే రుణమాఫీ చేసిందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 23 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా భారాస అడ్డుకుంటోందని ఆరోపించారు. భారాస, భాజపాకు రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఆక్షేపించారు.
హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పార