![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 01:51 PM
హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తన నివాసమైన శామీర్ పేటలో గురువారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హుజురాబాద్ బీజేపీ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బీజేపీ సీనియర్ నాయకులు గంగిశెట్టి రాజ, నల్ల సుమన్, సంజీవరెడ్డి, పోతుల సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.