|
|
by Suryaa Desk | Sat, Mar 22, 2025, 12:40 PM
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. వరుసగా రెండోరోజు గోల్డ్ ధరలు దిగొచ్చాయి. ఇటీవల ఓరోజు పెరుగుతు.. మరోరోజు తగ్గుతూ షాకిచ్చిన పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.ధరలు పడిపోవడంతో కొనుగోలుదారులు బంగారం కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. నేడు తులం బంగారం ధర రూ. 440 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,978, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,230కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గడంతో రూ. 82,300 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 440 తగ్గడంతో రూ. 89,780 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 89,90 వద్ద ట్రేడ్ అవుతోంది.బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,01,000 వద్దకు చేరింది.