బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 10:59 AM
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదర మండలంలో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగుపాటుకు గురై ఈదమ్మ (55), సైదమ్మ (35) ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో స్థానికంగా విషాదం నెలకొంది.