|
|
by Suryaa Desk | Tue, May 06, 2025, 08:01 PM
రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.లక్ష్మణ్ గారి నేతృత్వంలో గవర్నర్ గారిని కలిసిన తెలంగాణ బిజెపి నేతలు.. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఇతర రాష్ట్రాలలో ఎలాగైతే పాకిస్తానీలను తమ దేశానికి పంపిస్తున్నారో, తెలంగాణలోనూ అక్రమంగా నివాసముంటున్న పాకిస్తానీలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి, వెంటనే పంపించివేయాలని కోరుతూ గవర్నర్‌కు తెలంగాణ బిజెపి నేతలు వినతిపత్రం అందజేశారు.జమ్మూ కాశ్మీర్‌లో హిందువులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దారుణమైన దాడి దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడికి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో… దేశ భద్రతకి ప్రమాదం కలిగించే వారిని తక్షణమే వెనక్కి పంపాల్సిన అవసరం ఉందని గవర్నర్ కి అందచేసిన వినతి పత్రంలో బిజెపి నేతలు పేర్కొన్నారు.గవర్నర్‌ను కలిసిన వారిలో తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు విజయ రామారావు, చింతల రామచంద్రా రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్.వీ.ఎస్.ఎస్ ప్రభాకర్, తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కుమారి బంగారు శృతి, డా. కాసం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.