ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 02:58 PM
గజ్వేల్ పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 25 మంది వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా విధించబడుతుందని, ప్రమాదాలు జరిగితే కుటుంబాలకు తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి నిబంధనలను పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్, ఎస్సై జగదీష్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.