|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 01:28 PM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా విద్యార్థులకు జీవితానికి సంబంధించిన కీలక సూచనలు చేశారు. ఫలితాల గురించి ఆలోచించకుండా చేసే పనిపై శ్రద్ధ పెట్టాలని, ఇష్టంతో కష్టపడితే విజయం అదే వస్తుందని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు."ఆర్బీఐ గవర్నర్ అవ్వాలంటే కొన్ని చిట్కాలు చెప్పండి" అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు మల్హోత్రా స్పందిస్తూ యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మాటలను గుర్తుచేశారు. "భవిష్యత్తును మనం అంచనా వేయలేం. మీ కర్మను మీరు చేయండి. మీ పనిని ఇష్టంతో, కష్టపడి చేయండి. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడే ఎలా ముందుకు వెళ్లాలనేది అర్థమవుతుంది" అని ఆయన వివరించారు. ఇదే ప్రశ్న తాను చదువుకున్న విద్యాసంస్థ ఐఐటీ కాన్పూర్‌కు వెళ్లినప్పుడు కూడా ఎదురైందని ఆయన గుర్తు చేసుకున్నారు.