బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను నిరసిస్తూ ఖమ్మంలో వీహెచ్‌పీ భారీ ఆందోళన
Tue, Dec 23, 2025, 01:03 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:20 PM
వనపర్తి జిల్లా పెబ్బేరులో నివసిస్తున్న వెంకటయ్య, పద్మ దంపతులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కర్నూలు జిల్లా బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గాసింగ్, దేవుడు వస్తాడని, అక్కడికి వెళ్తే ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పి వారిని నమ్మించాడు. వారి పొలంలో నిధి ఉందని, అది తీసేంత వరకూ ప్రాణహాని ఉంటుందని భయపెట్టి, రూ.80 లక్షలు కాజేశాడు. అనంతరం క్షుద్రపూజలు చేసి, అమ్మవారి విగ్రహం బయటపడిందని చెప్పి, దానిని ఇంట్లో పెట్టుకుంటే ప్రాణహాని ఉంటుందని, అమ్మితే కోట్లు వస్తాయని నమ్మబలికాడు. విదేశాల నుంచి కొందరు కొనుగోలుకు వచ్చారని చెప్పి, ఐదు సార్లు ఢిల్లీకి తీసుకెళ్లాడు.