|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:46 PM
సదాశివపేట పట్టణంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్ భాయ్ హోటల్ వద్ద జగ్గారెడ్డి డబ్బులు పంచుతున్నారని కొందరు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జగ్గారెడ్డిని అక్కడి నుంచి పంపించి వేశారు. సదాశివపేట సీఐ వెంకటేష్ అక్కడికి చేరుకొని అక్కడే ఉన్న కొంత మంది స్థానికులను, జగ్గారెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో డబ్బు పంచడం పట్ల సదాశిపేట పోలీస్ స్టేషన్ లో జగ్గారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. అయితే సదాశివపేటకు వెళ్ళినప్పుడల్లా ఆ హోటల్ వద్ద జగ్గారెడ్డికి టీ తాగే అలవాటు ఉందని, అక్కడ ఆగిన సమయంలో తన వద్దకు వచ్చే పేదలకు, వృద్ధులకు డబ్బులు పంచినట్లు జగ్గారెడ్డి అనుచరులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఎన్నికల కోడ్ నిబంధనలను ఎవరు ఉల్లగించిన వారిపై ఉల్లంఘనల కేసులు నమోదు చేసి, తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి.