|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:48 PM
తెలంగాణలో బుధవారం జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సాధారణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజును 'పెయిడ్ హాలిడే'గా ప్రకటిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పారిశ్రామిక సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులందరికీ వర్తిస్తుంది.అదేవిధంగా పోలింగ్ సజావుగా సాగేందుకు, ఉద్యోగులకు సెలవు అమలయ్యేలా చూడాలని లేబర్ కమిషనర్, ఫ్యాక్టరీల డైరెక్టర్, అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.