|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:51 PM
నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడలో ఉన్న నారాయణ స్కూల్ భవనం సెల్లార్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు పాఠశాల అంతటా వ్యాపించడంతో, పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను, ఉపాధ్యాయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెల్లార్ లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ లేదా పాత సామాగ్రి వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఫైర్ సిబ్బంది ధృవీకరించారు.