|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 03:57 PM
జనగామ మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు మరియు భువనగిరి ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజలను కోరారు.జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో గాధరి సిద్ధిరాములు, 21వ వార్డులో కడకంచి బలమని, శ్రీనివాస్, 23వ వార్డులో బల్దా మల్లేష్ గార్లతో పాటు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అన్ని వార్డుల అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.సోమవారం మధ్యాహ్నం ఆయా వార్డుల్లో కార్నర్ మీటింగ్స్ నిర్వహించి, భారీ ర్యాలీతో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉత్సాహపరిచి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.ర్యాలీ సందర్భంగా బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ, పట్టణాల అభివృద్ధి ప్రజా ప్రతినిధుల చేతుల్లోనే ఉందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించగలిగేది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అదే విధంగా మున్సిపాలిటీల్లో కూడా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.