by Suryaa Desk | Sat, Dec 28, 2024, 07:11 PM
డార్లింగ్ ప్రభాస్ ను సినీ ఇండస్ట్రీలో ఇష్టపడని వారంటూ ఉండరేమో. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. ఎంతో సింపుల్ గా ఉంటారని... పెద్ద స్టార్ అయినా ఏమాత్రం గర్వం ఉండదని చెప్పారు. సినిమా సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా ఒకే విధంగా స్పందిస్తారని అన్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ తో కలిసి తాను పని చేశానని... ఆయన గొప్ప కలలు కంటుంటారని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Latest News