|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 03:35 PM
నిజామాబాద్ రూరల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మల్లారంలో గురువారం ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సె మహేశ్‌కుమార్ వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన శ్రావణ్ (31)కు పెళ్లి సంబంధాలు వచ్చినా ఏవీ కుదరకపోవడంతో మనస్తాపానికి గురై మల్లారం గాంధీనగర్ గ్రామాల మధ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.