|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 03:40 PM
పిట్లం మండల కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఆప్తాలమిక్ ఆఫీసర్ హరికిషన్ రావు 56 మందిని పరీక్షించగా 9 మందిని ఆపరేషన్ కొరకు బోధన్ కంటి ఆసుపత్రికి పంపారు. అలాగే ఒకరిని హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి రిఫర్ చేశారు. 18 మంది దృష్టి లోపాలు గల వారికి కళ్లజోళ్లు అందజేశారు.