by Suryaa Desk | Sat, Aug 10, 2024, 07:40 PM
భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీలో జరిగింది. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికురాలిగా పని చేస్తున్న బత్తుల ఓదెమ్మ.. రోజూలాగే శుక్రవారం రోజున విధులకు హాజరైంది. అయితే.. మధ్యలో దాహం వేయటంతో.. పక్కనే ఎలాంటి సూచనలు లేకుండా ఉన్న బాటిల్ కనిపించటంతో.. అందులో ఉన్నది మంచి నీరు అనుకుని తాగింది. తీరా చూస్తే అందులో ఉన్నది దోమల మందు అని తేలింది.
దోమల మందు తాగిన వెంటనే.. ఓదెమ్మను అస్వస్థతకు గురవటంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన వైద్యులు.. పరిస్థితి విషమిస్తోందని, మెరుగైన వైద్యం కోసం ఆమె తాగిన దోమల మందు డబ్బాను తీసుకురమ్మని అధికారులకు చెప్పారు. ఆమె తాగిన మందు గురించి తెలిస్తే.. అందుకు అనువైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడొచ్చనే కోణంలో వైద్యులు ఈ విషయం చెప్పారు.
అయితే.. అదే సమయంలో జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో ఉండటంతో.. అధికారులు ఈ విషయాన్ని మర్చిపోయారు. దీంతో.. దోమల మందు డబ్బాను చాలా ఆలస్యంగా ఆస్పత్రికి పంపించారు. ఓదెమ్మకు సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని.. సరైన సమయంలో ఆ డబ్బాను ఆస్పత్రికి పంపించి ఉంటే విరుగుడు మెడిసిన్స్ ఇచ్చి.. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసేవాళ్లమని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం. కాగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే.. అధికారు నిర్లక్ష్యంతో ఓదెమ్మ మరణించిందని తేలటంతో.. ఈ విషయం బయటికి పొక్కకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. అదే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఓదెమ్మ కుటుంబీకుల్లో ఒకరిని పిలిచి.. ఈ విషయం బయటికి పొక్కకుండా ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షలు ఇప్పిస్తామంటూ పలువురు నేతలు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మరింత సాయం అందేలా చూస్తామన్నారు.