by Suryaa Desk | Sat, Aug 10, 2024, 07:36 PM
కొత్తగూడెం - బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం బీసీ గురుకుల పాఠశాలలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఖమ్మం జిల్లాకు చెందిన దుండగుల సాయికిరణ్ లక్ష్మీపురం బీసీ గురుకులంలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 5న భోజన సమయంలో సాయికిరణ్ ముఖంపై మరో విద్యార్థి దాడి చేయడంతో తీవ్ర గాయమైంది. వెంటనే సిబ్బంది స్థానికంగా చికిత్స చేయించి. అతడి తల్లి యాదమ్మకు ఫోన్ చేసి సాయికిరణ్ కిందపడితే గాయమైందని చెప్పడంతో మరుసటి రోజు ఆమె పాఠశాలకు వచ్చింది. పాఠశాల నుంచి తీసుకెళ్లి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షల్లో ముక్కు భాగం ఎముక విరిగిందని తేలడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.కాగా.. దీనిపై గురుకుల ప్రిన్సిపాల్ కి అతడి తల్లి ఫోన్ చేసి ప్రశ్నించగా.. సాయికిరణ్ పై మరో విద్యార్థి కుర్చీ విసిరేయడంతోపాటు ముఖంపై దాడి చేశాడని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే నా కుమారుడిపై దాడి జరిగిందని.. దీనికి వారే బాధ్యత వహించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .