by Suryaa Desk | Sun, Aug 11, 2024, 07:33 PM
తెలుగు రాష్ట్రాల్లో.. నిర్మాణ రంగంలో బాహుబలి కంపెనీ అయిన మై హోమ్ గ్రూప్ మరో ఫ్లాగ్‌షిప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ "మై హోమ్ అక్రిదా"ను అట్టహాసంగా ప్రారంభించింది. హైదరాబాద్ నగరలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి, హైటెక్ సిటీకి దగ్గరలో గోపన్ పల్లి నుంచి తెల్లాపూర్ రోడ్డు మార్గంలోని ఫ్రైమ్ ఏరియాలో ఈ మై హోమ్ అక్రిదా టవర్స్ రాబోతున్నాయి. మై హోమ్ అక్రిదా కింద 12 హైరైజ్ (జీ+39 ఫ్లోర్స్‌తో) టవర్లలో 3780 ఫ్లాట్‌లతో రాబోతోంది. ఇందులో భాగంగా.. ఫేజ్-1లో 6 టవర్లలో బుకింగ్స్ ఈరోజు ప్రారంభమయ్యాయి.
మై హోమ్ అక్రిదా ప్రాజెక్ట్‌ను 24.99 ఎకరాల్లో G+39 అంతస్తులతో.. 81 శాతం ఓపెన్ ప్లేస్‌తో 12 టవర్స్‌ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 1399 sft నుంచి 2347sft వరకు 2BHK, 2.5BHKతో పాటు 3BHK ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్‌మెంట్‌లు నిర్మించనున్నారు. ఒక్కో అంతస్తుకు 8 ఫ్లాట్‌లతో కూడిన మొత్తం 12 టవర్లను నిర్మిస్తున్నారు.
అతివేగంగా అభివృద్ధి చెందుతున్న తెల్లాపూర్‌లో ఈ ప్రాజెక్ట్ వస్తుండటం మరో హైలైట్. హైదరాబాద్‌వో అత్యంత ముఖ్యమైన ప్రదేశాలైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ORR, ఎయిర్‌పోర్ట్, హై-ఎండ్ రెస్టారెంట్లు, మాల్స్, స్కూళ్లు.. మరెన్నో సులువుగా చేరుకునే విధంగా.. విశాలమైన రోడ్ల కనెక్టివిటీ కూడా ఉంది. శాంతియుతమైన, చక్కటి ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్.. నివాసితులకు అన్నిరకాల సౌలభ్యాలను అందిస్తోంది.
మై హోమ్ సంస్థ నిర్మిస్తోన్న ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లో మరిన్ని రెసిడెన్షియల్ ఆఫర్‌లు, ప్రపంచ స్థాయి మాల్, ఇంటర్నేషనల్ స్కూల్, హాస్పిటల్ ఇలా మరెన్నో ప్రాజెక్టులు భవిష్యత్తులో రానున్నాయి.
ప్రాజెక్ట్ హైలైట్స్..
7.5 ఎకరాల సెంట్రల్ ల్యాండ్‌స్కేప్
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 5 నిమిషాల ప్రయాణం
ప్రతి టవర్‌లో డబుల్ హైట్ ఎంట్రెన్స్ లాబీ
1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 క్లబ్‌హౌస్‌లు
సాయుక్‌కు ఆనుకుని రాబోయే ఇంటర్నేషనల్ స్కూల్
2 రూఫ్‌టాప్ ఫుట్‌సాల్ మరియు పికిల్ బాల్ కోర్టులు
టెంపరేషన్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్
మై హోమ్ అక్రిదా లాంచ్ సందర్భంగా మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు మాట్లాడుతూ.. "సౌకర్యం, లొకేషన్ సౌలభ్యం, దగ్గరగా ఉండేలా హౌసింగ్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేయడంలో మై హోమ్ మూడు దశాబ్దాలుగా అగ్రగామిగా ఉంది. మై హోమ్ అక్రిదా కూడా అదే నిబద్ధతకు కొనసాగింపు." అని తెలిపారు.