by Suryaa Desk | Sun, Aug 11, 2024, 07:37 PM
బంగారానికి రోజు రోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. ఈ మధ్య భారీగా పెరిగిన బంగారం,,, మధ్యలో ఒక్కసారిగా వేలకు వేలు పడిపోయింది. దీంతో.. జనాలు పసిడిని కొనుక్కునేందుకు ఎగబడ్డారు. దీంతో.. బంగారం మాఫియా మొదలుపెట్టారు. కృత్తిమ కొరతను ఏర్పరిచి.. జనాల దగ్గరి నుంచి డబ్బులు దండుకున్నారు. ఇక.. ఇదే క్రమంలో స్మగ్లర్లు కూడా రెచ్చిపోతున్నారు. ఎలా స్మగ్లింగ్ చేసినా.. పోలీసులు పట్టేసుకుంటున్నారని.. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఓ స్మగ్లర్ బంగారాన్ని తరలించిన విధానం చూసి.. అందరూ షాక్ అవుతున్నారు.
తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. ప్రయాణికుడి వద్ద ఏకంగా కోటి ఆరువేల రూపాలయ విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికులు.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే కస్టమ్స్ ఆఫీసర్లను చూసి కంగుతిన్నాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు.. ఎయిర్ పోర్టులోనే అటు ఇటు తిరుగుతూ టైంపాస్ చేశాడు.
అతని కదలికలపై అధికారులకు అనుమానం రావటంతో.. అంతర్జాతీయ నిష్క్రమణ వద్ద అనుమానిత ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతన్ని, అతని లగేజ్‌ను తనిఖీ చేయగా భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. రెండు పెద్ద మెటల్ బార్, పసుపు రంగం లోహపు గొలుసు ఇలా.. మొత్తంగా కోటికి పైగా విలువ చేసే సుమారు కిలోన్నర బంగారం దొరికింది. అయితే.. ఈ బంగారాన్ని ఆ ప్రయాణికుడు.. తన బ్యాగ్‌తో పాటు ఎడమ షూలో కూడా దాచిపెట్టాడు. ప్రయాణికుడి దగ్గర స్వాధీనం చేసుకున్న బంగారం మొత్తం బరువు 1390.850 గ్రాములు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అయితే.. ఈ ప్రయాణికుడు ఇంతకు ముందు కూడా బంగారం సరఫరా చేశాడా..? ఇదే మొదటిసారా..? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలిసిందే.. అంత పవిత్రమైన బంగారాన్ని అలా షూలో కాళ్ల కింద ఎలా పెట్టుకుని తీసుకొచ్చావు నాయనా.. ఇంకెక్కడా ప్లేసే దొరకలేదా అని కామెంట్లు చేస్తున్నారు.