కేవలం 5 నిమిషాల్లో 2.62 లక్షల సంపాదన.. అరచేతిలో వైకుంఠం అంటే ఇదే కాబోలు
Mon, Nov 18, 2024, 08:02 PM
by Suryaa Desk | Mon, Nov 18, 2024, 07:49 PM
పొగతాగటం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక అందరికీ తెలిసిందే. అలాంటి ఓ వ్యసనం వల్ల ఓ వృద్ధురాలు స్వయంగా చావును కొని తెచ్చుకుంది. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్లో జరిగింది. బొడ్డు పోచమ్మ అనే 90 ఏళ్ల వృద్ధురాలు సగం తాగేసిన బీడీ ముక్కను మంచం కోడుపై పెట్టి పడుకోవడంతో ఆ నిప్పు మంచానికి అంటుకుని మంటలు వచ్చాయి. ఆ మంటల్లో పోచమ్మ కాలిపోయింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది.