by Suryaa Desk | Mon, Nov 18, 2024, 08:30 PM
ఆత్మకూరు మండలంలోని నీరుకుల్లా గ్రామంలో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ బండి అశోక్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా ఎస్సీలంతా కలిసి ఉంటేనే ఎస్సీ జాతి బాగుపడుతుందని ఎస్సీ లందరూ కలిసి ఎస్సీలు అభివృద్ధి కోసం పాటుపడాలని కొందరి స్వార్థం కోసం వర్గీకరణ పేరుతో ఎస్సీలను విడగొట్టాలని చూడడం సరైనది కాదని ఆయన పిలుపునిచ్చారు డిసెంబరు ఒకటి జరిగే మాలల సింహగర్జన మహాసభను మాల కుల బంధువులందరికీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మకూరు మండల కమిటీ ఎన్నుకున్నారు
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆత్మకూరు మండల కన్వీనర్ గా పసుల లక్ష్మీనారాయణ కో కన్వీనర్ గా వంగేటి సత్యనారాయణ సిరిమిళ్ళ రవీందర్ ఎన్నుకోవడం జరిగింది దీనితోపాటు నీరుకుల్లా గ్రామ కమిటీ కన్వీనర్ గా న్యాతకాని వనయ్య కో కన్వీనర్ వంగేటి రవికుమార్ సిరిమిళ్ళ రాజేందర్ న్యాతకాని పైడి మహిళా విభాగం నాయకులు వంగవీటి మానస సిరిమిళ్ళ కల్పన దాసరి కవిత తదితరులను జరిగింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కన్వీనర్ ముప్పిడి శ్రవణ్ కుమార్ జిల్లా కోకన్వీనర్స్ కునుమల్ల రవీందర్ దండు రాజు గ్రామ నాయకులు గజ్జల బిక్షపతి న్యాతకాని సారయ్య శంకర్ నీలం పవన్ సిరిమిళ్ళ విజయ్ కుమార్ తుప్పరి రమేష్ తుప్పరి వెంకటస్వామి తోపాటు మాల కుల సంఘ నాయకులందరూ పాల్గొన్నారు