by Suryaa Desk | Mon, Nov 18, 2024, 08:00 PM
భాగ్యనగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది హైడ్రా. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. వందనపురి కాలనీ సర్వేనెంబర్ 848లో అక్రమంగా ఇల్లు నిర్మించారని ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున జేసీబీ సహాయంతో సిబ్బంది అక్కడకు చేరుకుని భవనాన్ని కూల్చివేశారు. అటు, అమీన్పూర్లో ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో ఆక్రమణలు జరగడంతో హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ అక్రమాలను తొలగిస్తామని హైడ్రా ప్రకటించింది. ఎటువంటి ఆందోళనలకు తావులేకుండా పోలీసులు ముందస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.