by Suryaa Desk | Thu, Sep 26, 2024, 04:16 PM
వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్‌లో ఖో ఖో CBSE రీజినల్ చాంపియన్ షిప్ వేడుకలు ఘనంగా ముగిశాయి. బాచుపల్లి వీ ఆర్ ఎస్ విజ్ఞానాజ్యోతి స్కూల్ లో ఖో ఖో టోర్నీ గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్నారు. అండర్ 14, అండర్ 17 అండర్ 19 విభాగంలో బాల బాలికలు పోటీల్లో పాల్గొన్నారు. ఈ టోర్నీలో మొత్తం 120 మ్యాచులు నిర్వహించబడ్దాయి. అనంతరం ఈ కార్యక్రమానికి మేనేజ్ మెంట్ తరపున ట్రస్టీ వల్లూరుపల్లి రమణ, పాఠశాల డైరెక్టర్, కొడాలి విజయ రాణి, సాయి జి రావు వీ యన్ ఆర్ కళాశాల పీ ఈ టీ ప్రతినిధులు శ్రీరాం మరియు ఖో ఖో అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి విజయ రాణి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ విద్యార్ధుల క్రీడా భవిష్యత్తును అద్భుతమైన ప్రతిభను మరియు టీమ్ వర్క్‌ను ప్రదర్శించిందన్నారు.
అండర్ 14 లో:
ప్రకాష్ విద్యానికేతన్, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్.
నల్గొండ పబ్లిక్ స్కూల్ – నల్గొండ, తెలంగాణ.
హీల్స్ పాఠశాల – తోటపల్లి, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఏకశిలా అంతర్జాతీయ పాఠశాల – వరంగల్, తెలంగాణ. విజేతలుగా నిలిచారు.
అండర్ 17 లో బాలురు
అక్కార్డ్ పాఠశాల – తిరుపతి, ఆంధ్రప్రదేశ్, శాంతినికేతన్ పాఠశాల – శామీర్పేట్, మేడ్చల్, తెలంగాణ.
బ్లూమింగ్ మైండ్స్ పాఠశాల – ఖమ్మం, తెలంగాణ, సంస్కార్ పాఠశాల – ఎర్రగడ్డ, హైదరాబాద్, తెలంగాణ విజేతలుగా నిలిచారు.
అండర్ 19 లో బాలురు
ప్రకాష్ పాఠశాల, అనకాపల్లి – అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్, ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై పాఠశాల – రంగారెడ్డి, తెలంగాణ.
HPS పబ్లిక్ పాఠశాల – ఖమ్మం, తెలంగాణ, సర్ CR రెడ్డి పాఠశాల, ఏలురు – ఏలూరు, ఆంధ్రప్రదేశ్, విజేతలుగా నిలిచారు.
అండర్ 14 లో బాలికలు
హీల్స్ పాఠశాల, తోటపల్లి– ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్, నల్గొండ పాఠశాల – నల్గొండ జిల్లా తెలంగాణ, ప్రకాష్ పాఠశాల – అనకాపల్లి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ సిస్టర్ స్టానిస్లాస్ EM పాఠశాల – కర్నూల్, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ విజేతలుగా నిలిచారు.
అండర్ 17 లో బాలికలు:
వీ ఆర్ ఎస్ విజ్ఞాన జ్యోతి స్కూల్ – బాచుపల్లి, మేడ్చల్, హైదరాబాద్ తెలంగాణ, మాంటిస్సోరి పాఠశాల – గొల్లపల్లి, అనంతపూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
విజ్ఞాన్ పాఠశాల – గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్, పల్లవి అంతర్జాతీయ పాఠశాల – కీసర, మేడ్చల్ జిల్లా తెలంగాణ విజేతలుగా నిలిచారు.
అండర్ 19 బాలికలు:
అక్కార్డ్ పాఠశాల – తిరుపతి, ఆంధ్రప్రదేశ్
హార్వెస్ట్ పాఠశాల – ఖమ్మం జిల్లా, తెలంగాణ, సిస్టర్ నివేదిత పాఠశాల – అమీర్ పేట్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
సర్ CR రెడ్డి పాఠశాల – ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లు విజేతలుగా నిలిచాయి. ఈ కార్యక్రమం యువ క్రీడాకారులను వారి నైపుణ్యాలను ప్రోత్సహించడానికి ఎంతో దోహద పడిందని కొడాలి విజయ రాణి అన్నారు. ఈ టోర్నీ ణి విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.