by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:17 PM
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శ్రీ ఆదర్శ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం విద్యార్థినీ విద్యార్థులు తీరొక్క పువ్వులు తీసుకువచ్చి బతుకమ్మలు పేర్చారు.
ఉపాధ్యాయ బృందంతో కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థులు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కోలాటం నృత్యాలు చేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు. పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోషంగా బతుకమ్మ సంబరాలు చేసుకోవాలని కోరారు. కరస్పాండెంట్ అంజయ్య, ప్రిన్సిపల్ శైలజ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.