by Suryaa Desk | Wed, Oct 02, 2024, 02:48 PM
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి లో ఉన్న బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజనం నాణ్యత మొదలగు వివరాలను కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
హాస్టల్ లో వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, పారిశుధ్యం బాగా ఉందా, స్టడి అవర్స్ జరుగుతున్నాయా వంటి అంశాలను ఆరా తీసిన కలెక్టర్ వసతి గృహం పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.